ఇంగ్లండ్ కెప్టెన్ జాస్ బట్లర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. లిమిటెడ్ ఓవర్ క్రికెట్ కు కెప్టెన్ గా తప్పుకున్నాడు. ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ లీగ్ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ చేతిలో పరాజయం నేపథ్యంలో అతను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక నేడు సౌతాఫ్రికా తో జరిగే మ్యాచ్ అతనికి కెప్టెన్ గా చివరి మ్యాచ్. ఇంగ్లండ్ లిమిటెడ్ ఓవర్ క్రికెట్ నుండి తప్పుకుంటున్నా… టీమ్ కు మేలు చేసే నిర్ణయం ఇది. మరో ఆటగాడు ఈ బాధ్యతలు స్వీకరించి కోచ్ మెక్ కల్లమ్ తో కలిసి టీమ్ ను మరింత ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నట్లు
తెలిపాడు. 2022 జులై నుండి బట్లర్ కెప్టెన్ గా ఉన్నాడు. అతని కెప్టెన్సీ లో టీమ్ 44 వన్డేలు ఆడి 18 గెలిచి 25 ఓడింది. ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు. 51 టీ20లలో 26 గెలిచి 22 ఓడింది. 3 మ్యాచ్ లలో ఫలితం రాలేదు. 2022లో టీ20 ప్రపంచ కప్ గెలిచింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు