ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత క్రికెట్ జట్టు దుబాయ్ వేదికగా మ్యాచ్‌లు ఆడుతున్న సంగతి తెలిసిందే.దీనితో టీమిండియా ప్రదర్శనను కొందరు విదేశీ మాజీ ఆటగాళ్లు తక్కువ చేసి చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ మేరకు భారత జట్టు విజయాలను తక్కువ చేసి చూపిస్తున్న వారికి బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, సౌరభ్ గంగూలీ ధీటైన సమాధానం ఇచ్చాడు.దుబాయ్ పిచ్ లు కంటే పాకిస్థాన్ పిచ్‌లు చాలా నయమని,భారత్ కనుక దుబాయ్‌లో కాకుండా పాకిస్థాన్ పిచ్‌లపై ఆడి ఉంటే ఇంకా భారీ స్కోర్లు చేసి ఉండేదని గంగూలీ అభిప్రాయం వ్యక్తం చేశారు.అయితే భారత క్రికెట్ జట్టు దుబాయ్ పిచ్‌లు అనుకూలమనే వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు.కొంతమంది చేస్తున్న వ్యాఖ్యల్లో పస లేదని, అవన్నీ చెత్త మాటలే అన్నారు.అలా ఎందుకు మాట్లాడతారో అర్థం కావడం లేదని విమర్శించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు