భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో బెల్జియం ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి మాగ్జిమ్ ప్రీవోట్‌తో భేటీ అయ్యారు. రెండు దేశాలు వాణిజ్యం, ఇండస్ట్రియల్, ఎడ్యుకేషన్, ఇన్నోవేషన్, సాంస్కృతిక రంగాలలో మంచి సంబంధాలు కొనసాగుతన్నాయని జైశంకర్ పేర్కొన్నారు. సెమీకండక్టర్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, క్లీన్ ఎనర్జీ ఫార్మాస్యూటికల్స్, డిజిటల్, మొబిలిటీ మరియు రక్షణ రంగాలపై కూడా తాము చర్చలు జరిపినట్లు చెప్పారు. ఆయా రంగాల్లో ఇరు దేశాలు ద్వైపాక్షిక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంపై సమగ్ర చర్చలు జరిగాయి. ఏడు రోజుల భారత పర్యటనలో ఉన్న బెల్జియం ప్రిన్సెస్ ఆస్ట్రిడ్ రేపు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలవనున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు