ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూ.పీ.ఎల్) లో ముంబై ఇండియన్స్ ఉమెన్స్ మరోసారి టైటిల్ విజేతగా నిలిచింది. ముంబై ఇండియన్స్ ఉమెన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ఉమెన్స్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ ఫైనల్ పోరులో ముంబై పైచేయి సాధించింది. ఢిల్లీ కూడా గొప్పగా పోరాడింది. ఫైనల్ లో టాస్ గెలిచిన ఢిల్లీ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్ 66 (44; 9×4, 2×6) హాఫ్ సెంచరీతో రాణించగా…నాట్ సివర్-బ్రంట్ 30 (28; 4×4) పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో జొనాస్సెన్ 2 వికెట్లు, నల్లపురెడ్డి చరణీ 2 వికెట్లు, మారిజన్ కాప్ 2 వికెట్లు, అనాబెల్ సూతర్లాండ్ 1 వికెట్ చొప్పున తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. దీంతో ముంబై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మారిజన్ కాప్ 40 (26; 5×4, 2×6), జెమీమా రోడ్రిగ్స్ 30 (21; 4×4) పరుగులు చేశారు. నిక్కీ ప్రసాద్ 25 నాటౌట్ (23; 1×4,1×6) చివరి వరకు పోరాడింది. ముంబై బౌలర్లలో బ్రంట్ 3 వికెట్లు, అమీలియా కెర్ 2 వికెట్లు, షబ్నిమ్ ఇస్మాయిల్, హేలే మ్యాథ్యూస్, సైకా ఇషాకే ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

