ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20-2025లో సచిన్ టెండూల్కర్ నేతృత్వంలోని ఇండియన్ మాస్టర్స్ జట్టు టోర్నీ విజేతగా నిలిచింది. ఫైనల్ లో వెస్టిండీస్ మాస్టర్స్ పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ లో టాస్ గెలిచిన వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఎల్.సిమన్స్ 57 (41; 5×4, 1×6) హాఫ్ సెంచరీతో రాణించాడు. డ్వేన్ స్మిత్ 45 (35; 6×4, 2×6) మంచి ప్రదర్శన కనబరిచాడు. ఇండియన్ మాస్టర్స్ బౌలర్లలో వినయ్ కుమార్ 3 వికెట్లు, నదీమ్ 2 వికెట్లు, పవన్ నేగి 1 వికెట్, స్టువర్ట్ బిన్నీ 1 వికెట్ తీశారు. ఇక లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ దూకుడుగా ఆడింది. అంబటి రాయుడు 74 (50; 9×4, 3×6) భారత్ అలవోకగా లక్ష్యానికి చేరువగా చేర్చాడు. సచిన్ టెండూల్కర్ 25 (18; 2×4, 1×6), గురు కీరత్ (14), యువరాజ్ సింగ్ (13 నాటౌట్), స్టువర్ట్ బిన్నీ (16 నాటౌట్) పరుగులు చేశారు. దీంతో ఇండియన్ మాస్టర్స్ 17.1 ఓవర్లలోనే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 149 పరుగులు చేసింది. వెస్టిండీస్ మాస్టర్స్ బౌలర్లలో యాష్లే నర్స్ 2 వికెట్లు, బెన్ 1 వికెట్, టినో బెస్ట్ 1 వికెట్ తీశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు