చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ ను ఘనంగా ఆరంభించింది. నేడుముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో విజయం సాధించి బోణీ కొట్టింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. తిలక్ వర్మ (31), సూర్య కుమార్ యాదవ్ (29), దీపక్ చాహార్ (28) పరుగులు చేశారు. మిగిలిన బ్యాటర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. చెన్నై బౌలర్లలో నూర్ అహ్మద్ 4 వికెట్లతో రాణించాడు. ఖలీల్ అహ్మద్ 3 వికెట్లు, నాథన్ ఎల్లీస్, అశ్విన్ చెరొక వికెట్ తీశారు. లక్ష్యాన్ని చెన్నై 6 వికెట్లు కోల్పోయి మరో 5 బంతులు మిగిలి ఉండగానే చేరుకుంది. రచిన్ రవీంద్ర 65 నాటౌట్ (45; 2×4, 4×6), రుతురాజ్ గైక్వాడ్ 53 (26; 6×4, 3×6) హాఫ్ సెంచరీలతో చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించారు. ముంబై బౌలర్లలో విఘ్నేష్ పుతుర్ 3 వికెట్లు, విల్ జాక్స్, దీపక్ చాహార్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
Trending
- ఇంటర్నేషనల్ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేన్ విలియమ్ సన్
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు

