విశాఖపట్నం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్ లో ఢిల్లీ అదరగొట్టింది. ఒక వికెట్ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. టాస్ గెలిచిన ఢిల్లీ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.మిచెల్ మార్ష్ 72 (36; 6×4, 6×6), నికోలస్ పూరన్ 75 (30; 6×4, 7×6) విధ్వంసకర బ్యాటింగ్ తో ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డారు. డేవిడ్ మిల్లర్ (27 నాటౌట్) కూడా ఫర్వాలేదనిపించాడు. అయితే వరుసగా వికెట్లు కోల్పోయింది. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 3 వికెట్లు, కుల్ దీప్ యాదవ్ 2 వికెట్లు, విప్రజ్ నిగమ్, ముకేశ్ కుమార్ లు చెరొక వికెట్ తీశారు. టార్గెట్ ఛేజింగ్ లో ఢిల్లీ ఫ్రేజర్ మెక్ గుర్క్ (1), అభిషేక్ పోరెల్ (0), సమీర్ రిజ్వీ (4) విఫలమవడంతో ఓటమి లాంఛనంగా కనిపించింది. అయితే అశుతోష్ శర్మ 66 నాటౌట్ (31; 5×4, 5×6) చివరి వరకు నిలిచి ఢిల్లీని విజయ తీరాలకు చేర్చాడు.స్ఠబ్స్ 34 (22; 1×4, 3×6), డుప్లెసిస్ 29 (18; 3×4, 2×6) పరుగులు చేశారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు