చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఐపీఎల్‌లో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.నిన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో 19 బంతుల్లో 25 పరుగులు చేసిన జడేజా,ఐపీఎల్‌లో 3000 పరుగులు పూర్తి చేసి 100 కంటే ఎక్కువ వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా నిలిచాడు.ఇప్పటి వరకు 242 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 3001 పరుగులు చేసి,160 వికెట్లు పడగొట్టాడు.కాగా చెన్నై జట్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో జడేజా 5వ స్థానంలో ఉన్నాడు.మహేంద్ర సింగ్ ధోని,సురేష్ రైనా, ఫాఫ్ డుప్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్ తర్వాత స్థానంలో జడేజా నిలిచాడు.సీఎస్‌కే తరఫున 133 వికెట్లు తీసి,అత్యధిక వికెట్లు సాధించిన డ్వేన్ బ్రావో (140) తర్వాత రెండో స్థానాన్ని ఆక్రమించాడు.ఐపీఎల్‌లో 1000+ పరుగులు,100+ వికెట్లు సాధించిన క్రికెటర్ల జాబితాలో జడేజా అగ్రస్థానంలో నిలిచాడు.ఈ జాబితాలో ఆండ్రీ రస్సెల్,అక్షర్ పటేల్,సునీల్ నరైన్,డ్వేన్ బ్రావో ఉన్నారు.అద్భుత ప్రదర్శనతో ఐపీఎల్ చరిత్రలో తన ప్రత్యేక గుర్తింపు నిలబెట్టుకున్న జడేజా,చెన్నై జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు