ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (మాజీ ట్విట్టర్)ను తన స్వంత ఏఐ స్టార్టప్ ‘ఎక్స్ ఏఐ’కు విక్రయించారు. ఈ డీల్ విలువ 33 బిలియన్ డాలర్లుగా (రూ. 2.80 లక్షల కోట్లు) ఉందని మస్క్ ప్రకటించారు. దీంతో ‘ఎక్స్ ఏఐ’ మొత్తం 80 బిలియన్ డాలర్ల కంపెనీగా మారిందన్నారు.అత్యాధునిక ఏఐ టెక్నాలజీని ‘ఎక్స్’లో అనుసంధానం చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని చెప్పారు.
అయితే ప్రస్తుతం ‘ఎక్స్’కు 600 మిలియన్ల యూజర్లు ఉన్నారని వెల్లడించారు. 2022లో మస్క్ 44 బిలియన్ డాలర్లకు ట్విట్టర్‌ను కొనుగోలు చేసి ‘ఎక్స్’గా మార్చిన విషయం తెలిసిందే.అప్పటి నుండి ఈ సంస్థ వివిధ మార్పులను ఎదుర్కొంది. ఇప్పుడు ‘ఎక్స్ ఏఐ’తో కలిపి భవిష్యత్ ఏఐ టెక్నాలజీని అభివృద్ధి చేయాలని మస్క్ లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రపంచానికి అధునాతన మోడల్స్ అందించేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.