లక్నో సూపర్ జెయింట్స్: 203-8 (20).
ముంబై ఇండియన్స్:191-5 (20).
లక్నో సూపర్ జెయింట్స్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య నేడు జరిగిన ఆసక్తికర మ్యాచ్ లో 12 పరుగుల తేడాతో లక్నో గెలిచింది. మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ మిచెల్ మార్ష్ 60 (31; 9×4, 2×6), మార్క్రమ్ 53 (38; 2×4, 4×4), ఆయుష్ బదోనీ 30 (19; 4×4), డేవిడ్ మిల్లర్ 27 (14; 3×4, 1×6) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో హార్థిక్ పాండ్య 5 వికెట్లతో రాణించాడు. విఘ్నేష్ పుతుర్, బౌల్ట్, అశ్వనీ కుమార్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. ఇక లక్ష్య ఛేదనలో ముంబై 191 పరుగులు మాత్రమే చేయగలిగింది. లక్నో బౌలర్లు చివర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తూ పరుగులు నియంత్రించగలిగారు. సూర్య కుమార్ యాదవ్ 67 (43; 9×4, 1×6) మంచి పోరాటం కనబరిచాడు. నమన్ ధీర్ 46 (24; 4×4, 3×6) ఉన్నంత సేపు ధాటిగా ఆడాడు. తిలక్ వర్మ (25 రిటైర్డ్ అవుట్), హార్థిక్ పాండ్య 28 నాటౌట్ ముంబై ఓటమిని ఆపలేకపోయారు. లక్నో బౌలర్లలో శార్థుల్ ఠాకూర్, ఆకాష్ దీప్, ఆవేష్ ఖాన్, దిగ్వేష్ లు ఒక్కో వికెట్ తీశారు.
Previous Articleఘనంగా ‘అమరావతి చిత్రకళా వీధి’
Next Article బంగారం, వెండి ధరలలో భారీ తగ్గుదల..!