క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన కుటుంబంతో కలిసి ఇటీవల అస్సాంలో పర్యటించారు.కాజీరంగా నేషనల్ పార్క్ సందర్శనలో భాగంగా జీప్ సఫారీ చేశారు.అక్కడి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ఎంతో ఆనందంగా గడిపారు.సచిన్ ఏనుగులకు ఆహారం అందిస్తూ ప్రత్యేకంగా మమకారం చూపించారు.ఆయన రాక తెలిసిన అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.సెల్ఫీలు, ఫొటోలు తీసుకుంటూ అభిమానులు సచిన్‌ను కలుసుకునేందుకు ఎగబడ్డారు.ఈ సన్నివేశాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సచిన్ ప్రస్తుతం కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఖాళీ సమయాన్ని ప్రయాణాలకు కేటాయిస్తూ శాంతిగా జీవితం కొనసాగిస్తున్నారు. తన అనుభవాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు