రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: 163-7 (20).
ఢిల్లీ క్యాపిటల్స్: 169-4 (17.5).
ఈ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. తాజాగా బెంగుళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో గెలిచి వరుసగా నాలుగో విజయం సాధించింది. మ్యాచ్ లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ 37 (17; 4×4, 3×6), విరాట్ కోహ్లీ 22 (14; 1×4, 2×6), రజత్ పటేదార్ 25 (23; 1×4, 1×6), టిమ్ డేవిడ్ 37 నాటౌట్ (20; 2×4, 4×6) పరుగులు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు, విప్రజ్ నిగమ్ 2 వికెట్లు, ముకేష్ కుమార్, మోహిత్ శర్మ ఒక్కో వికెట్ తీశారు. అనంతరం ఢిల్లీ 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. కే.ఎల్.రాహుల్ 93 నాటౌట్ (53; 7×4, 6×6) విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగాడు. బెంగళూరు బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టాడు. స్టబ్స్ 38 (23; 4×4, 1×6) కూడా రాణించడంతో మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే గెలుపు కైవసం చేసుకుంది.
Previous Articleచేస్తున్న ప్రకటనలు ప్రచారం కోసం కాకుండా ఆక్వా రైతులకు మేలు చేసేలా ఉండాలి: మాజీ సీఎం వైఎస్ జగన్
Next Article లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ లో 6 క్రికెట్ టీమ్ లు..!