పంజాబ్ కింగ్స్:245-6 (20).
సన్ రైజర్స్ హైదరాబాద్:247-2 (18.3).
సన్ రైజర్స్ హైదరాబాద్ జూలు విదిలించింది. వరుస పరాజయాలకు అడ్డుకట్ట వేస్తూ భారీ లక్ష్యాన్ని ఛేదించి మరోసారి తన స్టామినా చూపింది. ఉప్పల్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ట్రోఫీ రేసులో తగ్గేదేలేదని తేల్చి చెప్పింది.
మ్యాచ్ లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 245 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 82 (36; 6×4, 6×6) టాప్ స్కోరర్. ప్రభ్ సిమ్రాన్ 42 (23; 7×4, 1×6) , స్టోయినీస్ 34 నాటౌట్ (11; 1×4, 4×6), నేహాల్ వధేరా 27 (22; 2×4, 1×6) పరుగులు చేయడంతో భారీ లక్ష్యాన్ని హైదరాబాద్ ముందుంచింది. అయితే ఈ టార్గెట్ హైదరాబాద్ కు ఏమాత్రం సరిపోదు అన్నట్లుగా బ్యాటర్లు చెలరేగారు. అభిషేక్ శర్మ 141 (55; 14×4, 10×6) విధ్వంసకర బ్యాటింగ్ ధాటికి భారీ టార్గెట్ చిన్నబోయింది. హెడ్ 66 (37; 9×4, 3×6) కూడా తోడవడంతో ఎక్కడా కనీసం తడబాటు లేకుండా ఛేదించి భారీ విజయం అందుకుంది.
వరుస పరాజయాలకు బ్రేక్… విధ్వంసకర బ్యాటింగ్ తో పంజాబ్ కింగ్స్ పై హైదరాబాద్ ఘనవిజయం
By admin1 Min Read