గుజరాత్ టైటాన్స్: 180-6 (20).
లక్నో సూపర్ జెయింట్స్:186-4 (19.3).
ఐపీఎల్ సీజన్ 18 లో భాగంగా నేడు గుజరాత్ టైటాన్స్-లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో లక్నో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ లో ముందు బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. శుభ్ మాన్ గిల్ 60 (38; 6×4, 1×6), సాయి సుదర్శన్ 56 (37; 7×4, 1×6) హాఫ్ సెంచరీలతో రాణించారు. లక్నో బౌలర్లలో శార్థుల్ ఠాకూర్ 2 వికెట్లు, రవి బిష్ణోయ్ 2 వికెట్లు, దిగ్వేష్ రాఠీ, ఆవేష్ ఖాన్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో లక్నో మరో మూడు బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 186 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ 61 (34; 1×4, 7×6) మరోసారి భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. మార్క్రమ్ 58 (31; 9×4, 1×6) ఆకట్టుకున్నాడు. దీంతో లక్నో అలవోకగా విజయం సాధించింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు