లక్నో సూపర్ జెయింట్స్: 166-7 (20).
చెన్నై సూపర్ కింగ్స్:168-5 (19.3).
ఈ సీజన్ లో వరుస పరాజయాలతో సతమతమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు మరో విజయం సాధించి తిరిగి తన సత్తా చాటింది. తాజాగా లక్నో వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆఖర్లో కెప్టెన్ ధోనీ మెరుపులు చెన్నై అభిమానులకు అదనపు ఆనందాన్నిచ్చాయి.
మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి తక్కువ స్కోరుకే లక్నోను పరిమితం చేశారు. రిషబ్ పంత్ 63 (49; 4×4, 4×6) హాఫ్ సెంచరీ చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. మిచెల్ మార్ష్ 30 (25; 2×4, 2×6), ఆయుష్ బదోనీ 22 (17; 1×4, 2×6), అబ్దుల్ సమాద్ 20 (11; 2×6) పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో రవీంద్ర జడేజా 2 వికెట్లు, మతీష పతిరనా 2 వికెట్లు, ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ షేక్ రషీద్ 27 (19; 6×4), రచిన్ రవీంద్ర 37 (22; 5×4) శుభారంభం అందించారు. తర్వాత వికెట్లు పడడంతో స్కోరు కొంచెం నెమ్మదించింది. అయితే శివమ్ దూబే 43 నాటౌట్ (37; 3×4, 2×6), మహేంద్ర సింగ్ ధోనీ 26 నాటౌట్(11; 4×4, 1×6) పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చారు.
తిరిగి గెలుపు బాట పట్టిన చెన్నై సూపర్ కింగ్స్… తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ పై విజయం
By admin1 Min Read

