ఇటీవల బ్యూనస్ ఎయిర్స్ లో జరిగిన వరల్డ్ కప్ ఫస్ట్ స్టేజ్ టోర్నీలో మంచి ప్రదర్శన కనబరిచిన భారత షూటర్లు మరో టోర్నీకి సమాయత్తమయ్యారు. నేటి నుండి ప్రారంభం కానున్న స్టేజ్-2 పోటీల బరిలోకి దిగనున్నారు. మొదటి రోజు పిస్టల్ విభాగంలో మను బాకర్, సురుచి, సైన్యం, సౌరభ్ చౌదరి, వరుణ్ తోమర్, రవీందర్ పోటీలో ఉన్నారు. మొత్తం పిస్టల్, రైఫిల్, షాల్గన్ విభాగాల్లో 43 దేశాల నుండి 400పైగా షూటర్లు ఈ టోర్నీలో పోటీపడుతున్నారు. 35 మంది సభ్యులతో కూడిన భారత టీమ్ 15 విభాగాల్లో పోటీలో ఉంది. బ్యూనస్ఎయిర్స్ లో నాలుగు గోల్డ్ మెడల్స్ సహా ఎనిమిది మెడల్స్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.
Previous Articleతిరిగి గెలుపు బాట పట్టిన చెన్నై సూపర్ కింగ్స్… తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ పై విజయం
Next Article త్వరలో రాజ్యసభకు ఎమ్ఎన్ఎమ్ అధినేత కమల్ హాసన్..?

