భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అండగా నిలిచాడు. అనారోగ్యం నుండి కోలుకుంటున్న అతనికి సునీల్ గవాస్కర్ ఫౌండేషన్ ద్వారా నెలకు రూ. 30వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన వినోద్ కాంబ్లీని సునీల్ గవాస్కర్ పరామర్శించాడు. కోచ్ రమాకాంత్ అచ్రేకర్ మెమోరియల్ కార్యక్రమంలో కూడా కాంబ్లీకి సహాయం చేస్తానని మాటిచ్చారు. ఇటీవలే వాంఖడే స్టేడియం 50 ఏళ్ల కార్యక్రమంలో కూడా సునీల్ గవాస్కర్ అతనిని కలిశారు. ఇక తాజాగా తన ఫౌండేషన్ ద్వారా సాయం అందించనున్నారు. వైద్య ఖర్చుల కోసం అదనంగా మరో రూ. 30వేలు ఈ ఫౌండేషన్ ఇవ్వనుంది. సునీల్ గవాస్కర్ పెద్ద మనసుకు పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీకి అండగా నిలిచిన క్రికెట్ లెజెండ్ సునీల్ గవాస్కర్
By admin1 Min Read
Previous Articleప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్ షిప్ సెమీస్ లో పంకజ్ అద్వానీ విజయం
Next Article భారత షూటర్ సౌరభ్ కు బ్రాంజ్ మెడల్