వరుసగా నాలుగు విజయాల తర్వాత మొదటి ఓటమి ఎదుర్కొన్న ఢిల్లీ క్యాపిటల్స్ తాజాగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో సూపర్ ఓవర్‌లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది.
తమ హోం గ్రౌండ్ లో ఢిల్లీ సత్తా చాటింది. సూపర్ ఓవర్‌లో అనూహ్యంగా విజయం సాధించింది. మొదటగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అభిషేక్ పోరెల్ 49 (37; 5×4, 1×6), కే.ఎల్.రాహుల్ 38 (32; 2×4, 2×6), అక్షర్ పటేల్ 34 (14; 4×4, 2×6), స్టబ్స్ 34 నాటౌట్ (18; 2×4, 2×6) పరుగులతో రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో ఆర్చర్ 2 వికెట్లు, హాసరంగా, తీక్షణ ఒక్కో వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో రాజస్థాన్ కూడా 20 ఓవర్లలో 188 పరుగులు చేసింది. యశస్వీ జైశ్వాల్ 51 (37; 3×4, 4×6), నితీష్ రాణా 51 (28; 6×4, 2×6) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. సంజు శాంసన్ (31), ధ్రువ్ జురెల్ (26) పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో స్టార్క్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారి తీసింది. సూపర్ ఓవర్ లో రాజస్థాన్ 11 పరుగులు చేయగా ఢిల్లీ 13 పరుగులు చేసి మ్యాచ్ కైవసం చేసుకుంది. ఈ విజయంతో ఢిల్లీ ఓ అరుదైన రికార్డు నమోదు చేసింది. ఐపీఎల్ చరిత్రలో నాలుగు సార్లు సూపర్ ఓవర్‌లో విజయం సాధించిన జట్టుగా రికార్డుల్లోకి ఎక్కింది. సూపర్ ఓవర్‌లో ఓ జట్టు ఇన్నిసార్లు విజయం సాధించడం ఇదే మొదటి సారి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు