హైదరాబాద్‌లోని ఇక్రిశాట్ పరిశోధనా కేంద్రం వద్ద చిరుతపులి కలకలం రేపింది. గత రెండు మూడు రోజులుగా పరిశోధనా క్షేత్రాల్లో తిరుగుతున్న చిరుతను గమనించిన సిబ్బంది వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.అధికారులు ప్రదేశాన్ని పరిశీలించి చిరుత ఆనవాళ్లను గుర్తించారు. వెంటనే సీసీ కెమెరాలు, బోనులు ఏర్పాటు చేశారు. చివరకు గురువారం తెల్లవారుజామున చిరుత బోనులో చిక్కింది. ఈ విషయాన్ని తెలుసుకున్న శాస్త్రవేత్తలు, సిబ్బంది, కూలీలు అంతా ఊపిరి పీల్చుకున్నారు.చిరుతను హైదరాబాద్ జూ పార్క్‌కు తరలించేందుకు చర్యలు ప్రారంభించారు.సాంకేతికంగా కీలకమైన ఇక్రిశాట్ ప్రాంతంలో వన్యప్రాణి ప్రత్యక్షం కావడం అధికారులు తీవ్రంగా పరిగణించారు. ప్రాణులు జనావాసాలకు దగ్గరగా రావడం తరచూ జరుగుతున్న నేపథ్యంలో, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు