ఐపీఎల్ 18 లో భాగంగా బెంగళూరు లోని చిన్నస్వామి స్టేడియం వేదికగా తాజాగా జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – పంజాబ్ కింగ్స్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్ 14 ఓవర్లకు కుదించారు. మొదటగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 14 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 95 పరుగులకే పరిమితమయింది. టిమ్ డేవిడ్ 50 నాటౌట్ (26; 5×4, 3×6) హాఫ్ సెంచరీ చేసి అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. రజత్ పటేదార్ (23) మిగిలిన బ్యాటర్లు రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, జాన్సన్, చాహాల్, హార్ ప్రీత్ బ్రార్ రెండేసి వికెట్లు పడగొట్టారు. బార్ట్లెట్ ఒక వికెట్ తీశాడు. ఇక స్వల్ప లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ 12.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. నేహాల్ వధేరా 33 నాటౌట్ (19; 3×4, 3×6) రాణించాడు. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ 2 వికెట్లు, హేజల్ వుడ్ 3 వికెట్లు పడగొట్టారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు