స్వర్ణాంధ్ర-2047 సంకల్పంలో భాగంగా స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం ప్రతి నెలా 3వ శనివారం నాడు జరుపుకుంటున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి కార్యక్రమం స్ఫూర్తివంతంగా ఉండేందుకు నెల నెలా ఒక్కో థీమ్ ను ఎంచుకుని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈసారి ‘e-వ్యర్థాల సేకరణ, వాటిని సురక్షిత పద్ధతుల్లో రీసైకిల్ చేయడం’ థీమ్ ను ఎంచుకున్నట్లు పేర్కొన్నారు. చెత్త నుంచి సంపద సృష్టించడం ద్వారా సర్క్యులర్ ఎకానమీ సాధ్యం అవుతుందని వివరించారు. ఈ స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి అధికారులు, జిల్లా కలెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎన్జీఓలు, కార్పొరేట్ సంస్థలు, విద్యార్థులు, యువత స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరారు. ఎక్కడికక్కడ ఇ-వేస్ట్ సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. వీటి నిర్వహణకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఎస్‌హెచ్‌జి సభ్యులను గుర్తించి.. వారి సేవలను వినియోగించుకోవాలని చెప్పారు. ‘రెడ్యూస్, రీయూజ్, రీ సైకిల్” అనేది e – వేస్ట్ కలెక్షన్ సెంటర్ల నినాదం కావాలని స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసి తద్వారా స్వర్ణాంధ్ర సంకల్పాన్ని మరింత ముందుకు వెళ్లే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు