మహిళల గ్రాండ్ ప్రీ చెస్ టోర్నమెంట్ లో భారత గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి టైటిల్ వైపు అడుగులు వేస్తోంది. తాజాగా ఏడో రౌండ్ లో 55 ఎత్తుల్లో చైనాకు చెందిన జు జినెర్ పై విజయం సాధించింది. మరో భారత క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక రష్యాకు చెందిన పొలీనా షవలోవాతో 43 ఎత్తుల్లో డ్రా చేసుకుంది. దివ్య దేశముఖ్ 42 ఎత్తుల్లో మంగోలియాకు చెందిన బత్కుయుగ్ పై విజయం సాధించగా.. రష్యాకు చెందిన అలీనా కలిన్స్కయా తో వైశాలి పాయింట్ షేర్ చేసుకుంది. మరో రెండు రౌండ్లు మిగిలున్న ఈ టోర్నమెంట్ లో కోనేరు హంపి 5.5 పాయింట్లతో ముందంజలో ఉంది. దివ్య దేశముఖ్ (5 పాయింట్లు) రెండు, హారిక (3.5 పాయింట్లు) నాలుగో స్థానాల్లో ఉన్నారు.
Previous Articleభారత్ కు మరో మెడల్…సిల్వర్ మెడల్ సాధించిన సిమ్రన్
Next Article ఆస్కార్ కు సంబంధించి కీలక విషయాలు వెల్లడించిన అకాడమీ