జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాద దాడి తరువాత పాకిస్థాన్ తో క్రికెట్ ఆడకూడదనే డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ఆ వ్యాఖ్యలకు మాజీ భారత కెప్టెన్ సౌరవ్ గంగూలీ మద్దతు పలికారు. ఇకపై పాకిస్థాన్ తో క్రికెట్ ఆడకూడదని బీసీసీఐకి విజ్ఞప్తి చేశారు. 100 శాతం తాను దీనికి అంగీకరిస్తానని అన్నారు. పాకిస్థాన్ తో క్రికెట్ సంబంధాలు తెంచుకోవాలని అన్నారు. ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించకూడదని స్పష్టం చేశారు. ప్రతి సంవత్సరం ఇలాంటి ఘటనలు జరగడం తమాషా కాదని పేర్కొన్నారు. తప్పకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. 2008 తర్వాత భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. 2012-13లో బైలేటరల్ సిరీస్ జరిగింది. ఐసీసీ ఈవెంట్ లలో మినహా ఈ రెండు దేశాలు క్రికెట్ ఆడలేదు.
ఇక ప్రపంచవ్యాప్తంగా అందరూ ముక్త కంఠంతో పహాల్గాం ఉగ్రదాడిని ఖండిస్తున్నారు అయితే పాకిస్థాన్ క్రికెటర్ లు మాత్రం ఒక్కరూ కనీసం స్పందించలేదు. ఆ దేశ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా మినహా దాడిపై స్పందించలేదు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు