ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లు, సోషల్ మీడియాలలో అశ్లీల కంటెంట్ పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆయా ఫ్లాట్ ఫామ్ లపై అటువంటి అశ్లీల ప్రసారాలను నిషేధించాలని దాఖలైన పిటిషన్ పై సమాధానం చెప్పాలని కేంద్ర ప్రభుత్వానికి, ఇతరులకు నోటీసులు జారీ చేసింది. ఈ విషయంలో పార్లమెంటు, శాసనసభలు లేదా వ్యవస్థ చర్యలు తీసుకోవాలని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ల ధర్మాసనం పేర్కొంది. ఇది మా పరిధిలోని అంశం కాదు. ఇప్పటికే మేము శాసన నిర్మాణ, కార్యనిర్వాహక వర్గాల అధికారాల్లో జోక్యం చేసుకుంటున్నామని ఆరోపణలున్నాయని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఈ అంశంపై వాక్ స్వాతంత్ర్యానికి, 19(2) అధికరణానికి మధ్య సమతౌల్యం సాధించే పరిష్కారాన్ని మేం కనుగొంటామని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చారు. మరోవైపు, ఈ పిటిషన్ ఎవరిమీదా వ్యతిరేక భావనతో వేసింది కాదని, ఓవర్ ద టాప్ (ఓటీటీ), సోషల్ మీడియా వేదికల్లో ప్రసారమవుతున్న విషయాలపై తీవ్ర ఆందోళన తెలియజేసేందుకు ఉద్దేశించిందని పిటిషనర్ తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ అన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు