ఐసీసీ విడుదల చేసిన మెన్స్ క్రికెట్ వార్షిక ర్యాంకింగ్స్‌లో లిమిటెడ్ ఓవర్ ఫార్మాట్లలో భారత హవా కొనసాగుతోంది. వన్డేలు, టీ20లలో భారత్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. అయితే టెస్టు ఫార్మాట్‌లో మాత్రం నాలుగో స్థానానికి పడిపోయింది. ఇందులో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. 2024 మే నుండి ఆడిన మ్యాచ్‌ల ఆధారంగా ర్యాంకులను వెల్లడించింది. వన్డే ర్యాంకుల్లో భారత్ నెంబర్ వన్ గా ఉంది. ఇటీవల ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న భారత్ తన రేటింగ్ పాయింట్లను 122 నుండి 124కు పెంచుకుని అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. చాంపియన్స్ ట్రోఫీ రన్నరప్ గా నిలిచిన న్యూజిలాండ్ రెండో స్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా మూడో స్థానంలో నిలిచింది. మరోవైపు టీ20ల్లో కూడా భారత జట్టే టాప్ లో ఉంది. రెండో స్థానంలో ఆస్ట్రేలియా ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్ లు ఉన్నాయి. టెస్టుల్లో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతోంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు