భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వాయిదా పడిన ఐపీఎల్ త్వరలో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారం పాటు వాయిదా పడడంతో విదేశీ ఆటగాళ్లంతా స్వదేశాలకు పయనమయ్యారు. ఇరు దేశాలు కాల్పుల విరమణకు కూడా అంగీకరించిన సంగతి తెలిసిందే. కాగా, పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ చేసిన పనితో ఆయనను అందరూ ప్రశంసిస్తున్నారు. విమానం ఎక్కిన ఆస్ట్రేలియా బయలుదేరిన పాంటింగ్ భారత్-పాక్ ల మధ్య కాల్పుల విరమణ ప్రకటన రాగానే విమానం దిగి ఢిల్లీలోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. పంజాబ్ ఆటగాళ్లు మార్క్ స్టోయినీస్, ఆరోన్ హార్టీ, జోష్ ఇంగ్లీస్, బార్ట్ లెట్ లతో మాట్లాడి కాల్పుల విరమణ ప్రకటన గురించి చెప్పి భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చి భారత్ లోనే ఉండే విధంగా ఒప్పించాడు. ఈ విషయాన్ని పంజాబ్ కింగ్స్ వర్గాలు ధృవీకరించాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు