శాఫ్ అండర్-19 ఫుట్ బాల్ ఛాంపియన్ షిప్ లో డిఫెండింగ్ చాంపియన్ భారత్ మరోసారి టైటిల్ కైవసం చేసుకుంది. తాజాగా జరిగిన ఫైనల్ లో భారత్ 1-1 (4-3) తో పెనాల్టీ షూట్ అవుట్ లో బంగ్లాదేశ్ పై విజయం సాధించింది. నిర్ణీత సమయానికి ఇరు జట్లు 1-1తో నిలిచాయి. భారత్ నుండి 2వ నిమిషంలో సింగమయుం షామి గోల్ చేయగా… బంగ్లాదేశ్ నుండి 61వ నిమిషంలో జోయ్ అహ్మద్ గోల్ చేసింది. పెనాల్టీ షూట్ అవుట్ లో బంగ్లాదేశ్ మొదటి 3 ప్రయత్నాలలో సఫలమైంది. భారత్ రెండే చేయగలిగింది. అయితే తర్వాత బంగ్లాదేశ్ రెండు సార్లు విఫలమైంది. భారత్ రెండుసార్లు గోల్స్ చేసి విజేతగా నిలిచింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు