ఐపీఎల్ సీజన్ 18 లో సమిష్టిగా రాణిస్తూ మంచి ప్రదర్శన కనబరుస్తున్న గుజరాత్ టైటాన్స్ మరో సూపర్ విక్టరీతో ఘనంగా ప్లే ఆఫ్స్ చేరింది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో 10 వికెట్ల తేడాతో బంపర్ విక్టరీ కొట్టింది. మ్యాచ్ లో ముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. కే.ఎల్.రాహుల్ 112 (65; 14×4, 4×6) సెంచరీతో రాణించాడు. అభిషేక్ పోరెల్ (30), అక్షర్ పటేల్ (25), స్టబ్స్ (21) పరుగులు చేశారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో అర్షద్ ఖాన్, ప్రసీద్ కృష్ణ, సాయి కిషోర్ ఒక్కో వికెట్ చొప్పున పడగొట్టారు. అనంతరం లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 19 ఓవర్లలోనే ఛేదించింది. సూపర్ ఫామ్ లో ఉన్న ఆ జట్టు ఆటగాళ్లు సాయి సుదర్శన్ 108 (61; 12×4, 4×6), శుభ్ మాన్ గిల్ 93 (53; 3×4, 7×6) భారీ ఇన్నింగ్స్ తో అలవోకగా విజయ తీరాలకు చేర్చారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు