సౌత్ కొరియా వేదికగా జరుగుతున్న ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ లో భారత అథ్లెట్లు పతకాలతో సత్తా చాటుతున్నారు. తెలుగు అథ్లెట్ యర్రాజీ జ్యోతి గత ఏడిషన్‌లో (2023 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్) కూడా స్వర్ణంతో సత్తా చాటిన ఆమె ఈసారి కూడా ఆసియా అథ్లెటిక్స్‌లో మరోసారి సత్తా చాటింది. 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణం సాధించింది. గత ఎడిషన్‌లో 13.09 సెకన్ల సమయంలో పోటీని పూర్తిచేసి బంగారు పతకాన్ని జ్యోతి కైవసం చేసుకుంది. అయితే తాజాగా మాత్రం సరికొత్త రికార్డును సృష్టించింది. ఈసారి 12.96 సెకన్లలోనే పూర్తిచేసిన 1998లో కజకిస్తాన్ అథ్లెట్ ఓల్గా షిషిజినా (13.04 సెకన్లు), 2011లో చైనా క్రీడాకారిణి సున్ యావె (13.04 సెకన్లు) నమోదు చేసిన రికార్డులను అధిగమించింది.
అంతేకాకుండా ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 100 మీటర్ల హర్డిల్స్‌లో వరుసగా రెండు, అంతకంటే ఎక్కువసార్లు పసిడి పతకాలు సాధించిన అయిదో క్రీడాకారిణిగా నిలిచింది. ఆమె విజయం పట్ల దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు