కడపలో టీడీపీ మహానాడు విజయవంతంగా పూర్తయింది. భారీగా తెలుగు దేశం శ్రేణులు పాల్గొని విజయవంతం చేశారు. అధినేత చంద్రబాబు, అగ్రనేత లోకేష్ లు తమ ప్రసంగాలతో పార్టీ శ్రేణులలో ఉత్సాహం నింపి దిశా నిర్దేశం చేశారు. ఇక ఈ కార్యక్రమంపై లోకేష్ సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
కడపలో 3రోజులపాటు పసుపు పండుగ మహానాడును విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వాములైన మహానాడు కమిటీల సభ్యులు, పార్టీనాయకులు, కార్యకర్తలందరికీ పేరుపేరునా నా అభినందనలు. రాష్ట్రం నలుమూలల నుంచి వెల్లువలా తరలివచ్చిన పసుపు సైన్యానికి ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చిన కడప ప్రజానీకానికి నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. రాబోయే 40ఏళ్లపాటు పార్టీని ముందుకు నడిపించే ఆరు శాసనాల ఆవిష్కరణకు రాజకీయ చైతన్యానికి మారుపేరైన కడప గడప వేదిక కావడం శుభసూచకంగా భావిస్తున్నాను. కడప మహానాడు ఇచ్చిన స్పూర్తితో తెలుగుజాతిని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపేందుకు అహర్నిశలు శ్రమిస్తానని లోకేష్ రాసుకొచ్చారు.
ఈ స్పూర్తితో తెలుగుజాతిని ప్రపంచంలో అగ్రగామిగా నిలిపేందుకు అహర్నిశలు శ్రమిస్తా: మంత్రి నారా లోకేష్
By admin1 Min Read