ఐపీఎల్ సీజన్ 18 ఫైనల్లోకి పంజాబ్ కింగ్స్ దూసుకెళ్లింది. తాజాగా ముంబై ఇండియన్స్ తో జరిగిన క్వాలిఫైయర్ మ్యాచ్ 2 లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. సూర్య కుమార్ యాదవ్ 44 (26; 4×4, 3×6), తిలక్ వర్మ 44 (29; 2×4, 2×6), జానీ బెయిర్ స్టో 38 (24; 3×4, 2×6), నమన్ ధీర్ 37 (18; 7×4) పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో ఒమర్జాయ్ 2 వికెట్లు, వి.వి.కుమార్, జేమీసన్, చాహాల్, స్టోయినీస్ ఒక్కో వికెట్ తీశారు. ఇక అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన పంజాబ్ కింగ్స్ 19 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఛేదించింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 87 నాటౌట్ (41; 5×4, 8×6) అద్భుతమైన పోరాటం కనబరిచాడు. నేహాల్ వధేరా 48 (29; 4×4, 2×6), జాస్ ఇంగ్లీస్ 38 (21; 5×4, 2×6), ప్రియాన్ష్ ఆర్య 20 (10; 2×4, 1×6)తో తమవంతు కృషి చేశారు. దీంతో పంజాబ్ కింగ్స్ ఘన విజయం సాధించింది.
Previous Articleమరి వారిపై చర్యలేవీ?: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Next Article మాగ్నస్ కార్ల్సన్ పై గుకేశ్ కు మరో సూపర్ విక్టరీ