ఆపరేషన్ సిందూర్ సమయంలో అభ్యంతరకర పోస్టు పెట్టిన ఇన్ఫ్లూయెన్సర్, లా స్టూడెంట్ శర్మిష్ఠ పనోలీని కోల్ కతా పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఇది రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోన్న నేపథ్యంలో దీనిపై తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ సందర్భంగా సనాతన ధర్మాన్ని అపహాస్యం చేస్తూ మాట్లాడే టీఎంసీ ఎంపీలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సనాతన ధర్మంపై మాట్లాడిన వీడియోను పవన్ ఎక్స్ లో పోస్టు చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ ఒక వీడియో పోస్టు చేసింది. తన మాటలు కొంత మందికి బాధ కలిగించేవిగా ఉన్నాయని గ్రహించి తర్వాత ఆమె.. దాన్ని తొలగించి, క్షమాపణలు కూడా చెప్పింది. వెస్ట్ బెంగాల్ పోలీసులు అత్యంత వేగంగా స్పందించి ఆమెపై చర్యలు తీసుకున్నారు. కానీ, సనాతన ధర్మాన్ని అపహాస్యం చేస్తూ కోట్లాది మంది బాధకు కారణమైన అక్కడి నాయకులు, టీఎంసీ ఎంపీల సంగతి ఏంటి? వారి వ్యాఖ్యలకు క్షమాపణలు ఎక్కడ? వారిని ఎందుకు అరెస్టు చేయలేదు? దైవదూషణను ఎప్పుడూ ఖండించాలి. లౌకికవాదం రెండు వైపులా ఉండాలి. ఇది కొందరికి షీల్డ్ లాగా.. మరికొందరికి స్వోర్డ్ (ఖడ్గం)కాకూడదని అన్నారు. వెస్ట్ బెంగాల్ పోలీసులు అందరిపట్ల ఒకేలా వ్యవహరించాలని పవన్ తన పోస్ట్ లో పేర్కొన్నారు.
ఇక ఈ ఘటన నేపథ్యంలోకి వెళితే పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్ పై స్పందించని బాలీవుడ్ నటులను ఉద్దేశిస్తూ శర్మిష్ఠ సామాజిక మాధ్యమాల్లో ఒక వీడియో పోస్టు చేసింది. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో వెంటనే తొలగించి క్షమాపణలు కోరింది. ఈ క్రమంలోనే ఆమెపై పలు ఫిర్యాదులు నమోదు కావడంతో పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు