నార్వే చెస్ టోర్నమెంట్ లో వరల్డ్ ఛాంపియన్ దొమ్మరాజు గుకేశ్ మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు. 9వ రౌండ్ వరకు 14.5 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న అతను 10వ రౌండ్ లో పరాజయం చెందాడు. ఆఖరి రౌండ్ లో అమెరికాకు చెందిన ఫాబియానా కరువానాతో తలపడ్డాడు. ఇక ప్రపంచ నెంబర్ వన్ మాగ్నస్ కార్ల్ సన్ 16 పాయింట్లతో తన చివరి రౌండ్లో గెలిచి టైటిల్ విజేతగా నిలిచాడు. అర్జున్ పై కార్ల్ సన్ విజయం సాధించాడు.
మహిళల విభాగంలో కోనేరు హంపి మూడో స్థానంలో నిలిచింది. 9వ రౌండ్ లో చైనాకు చెందిన లీ టింగ్జీ చేతిలో ఓడి 13.5 పాయింట్లతో రెండో స్థానానికి చేరింది. చివరి రౌండ్లో చైనాకు చెందిన వెన్జున్ తో హంపి డ్రా చేసుకుంది. అయితే ఆర్మగెడినో విభాగంలో విజయం సాధించింది. దీంతో హంపి 15 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. అగ్రస్థానంలో ఉన్న ఉక్రెయిన్ కు చెందిన అనా ముజ్ల్చుక్ (16.5) వైశాలితో జరిగిన క్లాసికల్ గేమ్ను డ్రా చేసుకోవడంతో టైటిల్ కైవసం చేసుకుంది. చివరి రౌండ్లో పుంజుకున్న చైనా క్రీడాకారిణి లీ టింగ్లో (16) రెండో స్థానం సాధించింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు