టెన్నిస్ ప్రపంచంలో క్లే కోర్టులో రఫెల్ నాదల్ తరువాత ఆ స్థాయిలో రాణిస్తూ పేరుగాంచిన కార్లోస్ అల్కరాజ్ మరోసారి తన సత్తా చాటాడు. రోలాండ్ గారోస్ లో తాజాగా జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు జానిక్ సిన్నర్ పై చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు. దీంతో అల్కరాజ్ వరుసగా రెండోసారి ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను నిలబెట్టుకున్నాడు. చరిత్రలోనే అత్యంత సుదీర్ఘంగా సాగిన ఈ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ మ్యాచ్ లో అల్కరాజ్ అసాధారణ పోరాట పటిమ, మానసిక దృఢత్వంతో అందరినీ ఆకట్టుకున్నాడు. 5 గంటల 29 నిమిషాల పాటు సాగిన ఈ హోరాహోరీ పోరులో 22 ఏళ్ల స్పానిష్ యువ కెరటం అల్కరాజ్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ముఖ్యంగా నాలుగో సెట్ లో మూడు మ్యాచ్ పాయింట్లను కాపాడుకుని, చివరికి 4-6, 6-7(4), 6-4, 7-6(3), 7-6(10-2) తేడాతో సిన్నర్ పై విజయం సాధించాడు.
Pic source: carlos Alcaraz (X).
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు