వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతను 29 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలకడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక ఇది ఎంతో కఠినమైన నిర్ణయమని పూరన్ తన ఇన్స్టా ఎకౌంటు లో పేర్కొన్నాడు. విండీస్ తరఫున 61 వన్డేల్లో 1,983 పరుగులు, 106 టీ20ల్లో 2,275 పరుగులు చేశాడు. ఇటీవల టీ20ల్లో విండీస్ జట్టుకు కెప్టెన్ గానూ వ్యవహరించాడు. జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ నకు 8 నెలల ముందే రిటైర్మెంట్ నిర్ణయం ప్రకటించాడు. ఎంతో ఆలోచించి తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు