ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ విజేతగా సౌతాఫ్రికా చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించుతూ ఐసీసీ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియాతో లార్డ్స్ వేదికగా జరిగిన ఫైనల్ లో 5 వికెట్ల తేడాతో గెలిచి అత్యద్భుతమైన ఆటతీరుతో సత్తా చాటింది. 282 పరుగుల లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏడెన్ మార్క్రమ్ 136 (207; 14×4), తెంబ బావుమా 66 (134; 5×4) కీలక ఇన్నింగ్స్ లు ఆడారు. నేడు ఓవర్ నైట్ స్కోరు 213/2 తో ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా మరో 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేదించింది.
ఇరు జట్ల స్కోరు వివరాలు:
ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్: 212
సౌతాఫ్రికా మొదటి ఇన్నింగ్స్: 138
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 207
సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 282-5.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ విజేత సౌతాఫ్రికా: ఆస్ట్రేలియాపై చిరస్మరణీయ విజయం
By admin1 Min Read