ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్ లో మొట్టమొదటి సారిగా ట్రై సిరీస్ లో భాగంగా నేపాల్, నెదర్లాండ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఏకంగా మూడు సూపర్ ఓవర్లు జరిగాయి. రెండు జట్ల మధ్య పలుమార్లు స్కోర్లు సమంగా నిలవడంతో చివరకు మూడో సూపర్ ఓవర్లో ఫలితం తేలింది. మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. ఆ తర్వాత టార్గెట్ ఛేజింగ్ లో నేపాల్ స్కోరును (152/8) సమం చేసింది.
మ్యాచ్ టై అవడంతో సూపర్ ఓవర్ నిర్వహించారు. తొలి సూపర్ ఓవర్లో ఇరు జట్లూ 19 పరుగులు చేయడంతో రెండోసారి టైబ్రేకర్ ఆడించారు. అందులోనూ రెండు జట్లూ చెరో 17 పరుగులు చేశాయి. దీంతో ఫలితం తేలడం కోసం మూడోసారి సూపర్ ఓవర్ నిర్వహించారు. అందులో డచ్ ఆల్ రౌండర్ జాచ్ లయన్- కాచెట్ నేపాల్‌కు ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా. నాలుగు బంతుల్లో రెండు వికెట్లు తీశాడు. దీంతో నెదర్లాండ్స్ లక్ష్యం ఒక్క పరుగుగా మారింది. ఛేదనకు దిగిన డచ్ జట్టు ఒక్క బంతికే సిక్స్ కొట్టి విజయం కైవసం చేసుకుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు