టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీలో భాగంగా ఓవల్ వేదికగా జరుగుతున్న ఆఖరిదైన 5వ టెస్ట్ లో ఇంగ్లాండ్ విజయానికి చేరువైంది. అద్భుతం జరిగితే మినహా దాదాపుగా భారత్ గెలుపు కష్టమే. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ గెలుపుకు 35 పరుగుల దూరంలో ఉంది.
అంతకు ముందు రెండో ఇన్నింగ్స్ లో భారత్ 396 పరుగులకు ఆలౌటయింది. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం మినహా ఇస్తే ఇంగ్లాండ్ టార్గెట్ 374 పరుగులుగా ఉంది. యశస్వీ జైశ్వాల్ 118 (164; 14×4, 2×6) సెంచరీతో రాణించాడు. ఆకాష్ దీప్ 66 (94; 12×4), రవీంద్ర జడేజా 53 (77; 5×4), వాషింగ్టన్ సుందర్ 53 (46; 4×4, 4×6) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ధ్రువ్ జురెల్ (34) పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో టంగ్ 5 వికెట్లతో రాణించాడు. అట్కిన్ సన్ 3 వికెట్లు, ఓవర్టన్ 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనలో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ 6 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ 111 (98; 14×4, 2×6), జో రూట్ 105 (152; 12×4) సెంచరీలతో ఆకట్టుకున్నారు. బెన్ డకెట్ 54 (83; 6×4) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక భారత బౌలర్లలో ప్రసీద్ కృష్ణ 3 వికెట్లు, సిరాజ్ 2 వికెట్లు, ఆకాష్ దీప్ 1 వికెట్ తీశారు.
టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీ చివరి టెస్టు… విజయానికి 35 పరుగుల దూరంలో ఇంగ్లాండ్
By admin1 Min Read