దేశంలోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీగా వరద నీరు వచ్చి చేరడంతో పలు రాష్ట్రాల్లో నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఢిల్లీలో నిన్న ఉదయం భారీవర్షాలు కురవడంతో పలు ప్రాంతాలు జలమయమైయ్యాయి. ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో ఉన్న త్రివేణీ సంగమం వద్ద నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. వారణాసిలో గంగానది నీటిమట్టం కూడా పెరుగుతోంది. హిమాచల్ ప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో రెండు నేషనల్ హైవేలతో పాటు 370 రోడ్లను మూసివేశారు. నేడు, రేపు కూడా ఈ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరించింది. జూన్ 20 నుంచి ఆగస్టు 2 వరకూ కురిసిన వానలకు హిమాచల్ లో 101 మంది మరణించారు. రూ.1,692 కోట్ల ఆస్తినష్టం వాటిల్లింది. వెస్ట్ బెంగాల్లోని ఉత్తర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు తీస్తా, జలఢాకా నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. అటు బిహార్ లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. అస్సాంలో రానున్న రెండు రోజులు, కేరళలో మరో ఐదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు