భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు సౌరవ్ గంగూలీ మన క్రికెటర్లపై ప్రశంసలు కురిపించారు. మన దేశంలో చాలా టాలెంట్ ఉందన్నారు. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌కు ముందు టెస్టులకు స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఇంగ్లాండ్ టూర్‌లో టీమిండియా ఎలా ఆడుతుందోనని అందరూ అనుకున్నారు. అయితే అంచనాలకు మించి అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించి సిరీస్ ను డ్రా చేసుకుని మన యువ క్రికెటర్లు ఇంగ్లాండ్ లో తమ సత్తా చాటారు. దీంతో భారత జట్టు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఈ క్రమంలో గంగూలీ స్పందిస్తూ మన దేశంలో ఎంతో మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారని, భారత క్రికెట్ ఎవరి కోసమూ ఆగదని అన్నారు.ఇంగ్లాండ్ టూర్‌లో మన ఆటగాళ్లు బ్యాటింగ్ చేసిన తీరు అద్భుతమని ప్రశంసిస్తూ భారత క్రికెట్ అలాగే ఉందన్నారు. భారత క్రికెట్ ఎదుగుదల క్రమాన్ని గుర్తు చేసుకున్నారు. సునీల్ గవాస్కర్ రిటైర్ అయిన తర్వాత ఆ లోటును సచిన్ టెండూల్కర్ భర్తీ చేశారని, అదే సమయంలో రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్ వచ్చారని అలాగే విరాట్ కోహ్లీ …కోహ్లీ తర్వాత ఇప్పుడు యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, శుభ్‌మన్ గిల్ స్టార్స్‌గా మారారని తెలిపారు. భారత క్రికెట్‌లో చాలా ప్రతిభ ఉందని, అది పెరుగుతూనే ఉంటుందని పేర్కొన్నారు. మన దేశవాళీ క్రికెట్ చాలా పటిష్టంగా ఉందని అన్నారు. ఐపీఎల్, భారత్ ఏ జట్టు, అండర్ – 19 జట్టు రూపంలో మనకు చాలా వేదికలు ఉన్నాయని పేర్కొన్నారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు