మహేంద్ర సింగ్ ధోనీ భారత మాజీ కెప్టెన్ గా ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించి దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్న క్రికెటర్. ఐపీఎల్ లో ఆడుతూ తన అభిమానులను కనువిందు చేస్తున్న ధోనీ తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రానున్న ఐపీఎల్ లో ఆడతాడో లేదో అన్న ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి.కాగా తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ నేను ఆడతానో లేదో తెలియదు. అందుకు ఇంకా చాలా సమయం ఉంది. నిర్ణయం తీసుకోవడానికి డిసెంబర్ వరకు వేచి చూస్తా. కాబట్టి ఇప్పుడే చెప్పడం కరెక్ట్ కాదు. తప్పకుండా నిర్ణయం తీసుకుంటానని వ్యాఖ్యానించాడు. అయితే ఆయనకు ఫ్యాన్స్ నుండి మళ్లీ ఆడాలని విజ్ఞప్తి వచ్చింది. ఒక అభిమాని ‘మీరు తప్పకుండా ఆడాలి సర్’ అని కోరారు. ధోనీ దానికి స్పందిస్తూ “నా మోకాలు నొప్పిగా ఉంది. మరి దానిని ఎవరు భరిస్తారు?” అని సరదాగా సమాధానం ఇచ్చాడు. దీంతో అక్కడంతా నవ్వులు విరిశాయి. ఐపీఎల్ 2026 సీజన్ వచ్చే ఏడాది మార్చి – మే మధ్య జరగనుంది. ధోనీ కెప్టెన్ గా చెన్నై సూపర్ కింగ్స్ కు 5 ట్రోఫీలు అందించిన సంగతి తెలిసిందే.
నా మోకాలు నొప్పిగా ఉంది. మరి దానిని ఎవరు భరిస్తారు?: ఫ్యాన్ కు ధోనీ సరదా రిప్లై
By admin1 Min Read