1971 భారత్-పాక్ యుద్ధ సమయంలో పాకిస్థాన్ చెర నుంచి అత్యంత సాహసోపేతంగా తప్పించుకున్న వారియర్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాజీ గ్రూప్ కెప్టెన్ డీకే పారుల్కర్ (రిటైర్డ్) కన్నుమూశారు. ఆయన వయసు 82 సంవత్సరాలు. మహారాష్ట్రలోని పుణె సమీపంలో ఉన్న తన నివాసంలో ఈనెల 10న ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. డీకే పారుల్కర్ కు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పారుల్కర్ మృతి పట్ల భారత వాయుసేన సంతాపం వ్యక్తం చేసింది. 1971 వార్ హీరో, పాకిస్థాన్ చెర నుంచి సాహసోపేతంగా తప్పించుకుని అసామాన్య ధైర్యసాహసాలు, చాకచక్యం చూపిన గ్రూప్ కెప్టెన్ డీకే పారుల్కర్ అమరులయ్యారు. వాయు యోధులందరి తరఫున ఆయనకు హృదయపూర్వక నివాళులని ఐఏఎఫ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ లో పోస్ట్ చేసింది.
1971 వార్ హీరో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మాజీ గ్రూప్ కెప్టెన్ డీకే పారుల్కర్ కన్నుమూత
By admin1 Min Read