మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టైటిల్ ను నిలబెట్టుకుని భారత్ సత్తా చాటింది. తాజాగా జరిగిన ఫైనల్లో 1-0తో ఒలింపిక్ రజత పతక విజేత చైనాపై గెలిచి మరోసారి ఛాంపియన్ గా నిలిచింది. ఛాంపియన్స్ ట్రోఫీలో చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టుగా దక్షిణ కొరియా (3 టైటిళ్లు) సరసన భారత్ నిలిచింది.
యువ స్ట్రైకర్ దీపిక భారత్ తరపున గోల్ చేసి ఆకట్టుకుంది. సాధించింది. రెండు జట్ల డిఫెండర్లు మంచి ఆటతీరుతో మ్యాచ్ తొలి అర్ధభాగంలో గోల్స్ నమోదు కాలేదు. కానీ ద్వితీయార్థం ఆరంభంలో లభించిన పెనాల్టీ కార్నర్ను దీపిక సద్వినియోగం చేసుకుని భారత్ ను ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. స్కోరు సమం చేయడానికి చైనా చేసిన ప్రయత్నాలను భారత్ సమర్దవంతంగా తిప్పికొట్టింది. లీగ్ దశలో భారత్ 3-0తో చైనాను ఓడించిన భారత్ ఇది మూడో ఆసియా ఛాంపియన్స్ 2016, 2023 టోర్నీ విజేతగా నిలిచింది. ఇక చైనా మూడోసారి రన్నరప్ గా నిలిచింది. జపాన్ టోర్నీ లో మూడో స్థానం సాధించింది. ఆ జట్టు 4-1తో మలేసియాపై విజయం సాధించింది.
విజయంతో సత్తా చాటిన హాకీ అమ్మాయిలకు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తలో రూ.10 లక్షల నగదు బహుమతిని ప్రకటించారు. సహాయ సిబ్బందికి ఒక్కొక్కరికి రూ.5 లక్షలు ఇవ్వనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. అమ్మాయిలు సాధించిన ఈ విజయం దేశానికి గర్వకారణమని నితీశ్ పేర్కొన్నారు.
Previous Articleఢిల్లీ లో రౌడీయిజం పెరిగింది: ముఖ్యమంత్రి
Next Article నేడు ప్రపంచ మత్స్యకార దినోత్సవం