ఇటీవల దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ లో వరుసగా రెండు శతకాలు సాధించిన భారత యువ కెరటం తిలక్ వర్మ (151, 67 బంతుల్లో 14×4, 10×6) మరోసారి సెంచరీతో ఆకట్టుకున్నాడు. ముస్తాక్ అలీ టోర్నీలో హైదరాబాద్ జట్టుకు ఆడుతూ మేఘాలయాపై ఈ శతకం నమోదు చేశాడు. దీంతో టీ20 ఫార్మాట్లో వరుసగా మూడు సెంచరీలు చేసిన తొలి బ్యాటర్ గా తిలక్ నిలిచాడు. భారత్ తరపున ఈ ఫార్మాట్లో 150 పైన పరుగులు చేసిన తొలి పురుష క్రికెటర్ అతడే. మహిళల్లో కిరణ్ నవిగిరె (162) ఈ ఘనత సాధించింది. కెప్టెన్ తిలక్ ధాటికి గ్రూప్-ఎ మ్యాచ్లో హైదరాబాద్ 179 పరుగుల తేడాతో మేఘాలయా పై ఘన విజయం సాధించింది. మొదట హైదరాబాద్ 4 వికెట్లకు 248 పరుగులు చేసింది. తిలక్ కి తోడు తన్మయ్ అగర్వాల్ (55) రాణించాడు. లక్ష్య ఛేదనలో అనికేత్ రెడ్డి (4/11), తనయ్ త్యాగరాజన్ (3/15) విజృంభించడంతో మేఘాలయా 15.1 ఓవర్లలో 69 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టు లో అర్పిత్ (27) పర్వాలేదనిపించాడు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు