ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత ఎన్నికల ప్రక్రియపై ప్రపంచ వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్ ప్రశంసలు కురిపించారు. అమెరికా లోని కాలిఫోర్నియా (California)లో ఇంకా ఓట్ల లెక్కింపు పూర్తికాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. భారత్ లో ఒక్క రోజులోనే 640 మిలియన్ల ఓట్లను ఎలా లెక్కించారు? అనే శీర్షికతో వచ్చిన ఓ వార్త కథన్నాన్ని ఎక్స్ వేదికగా షేర్ చేశారు. దీనికి ఆయన ‘భారత్ ఒక్క రోజులోనే ఇన్ని ఓట్లను లెక్కించింది. కానీ, కాలిఫోర్నియా ఇంకా ఓట్ల లెక్కింపులోనే ఉందంటూ ట్వీట్ చేశారు.
ఈ నెల 5న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించినట్లు ప్రకటించడం కూడా జరిగిపోయింది. అయినప్పటికీ కాలిఫోర్నియాలో ఇంకా ఓట్ల లెక్కింపు పూర్తికాకపోవడం గమనార్హం. ఈనేపథ్యంలో మస్క్ చేసిన పోస్ట్ ట్రెండ్ అవుతోంది. ఎన్నికలప్పుడు ట్రంప్ కి మద్దతుగా మస్క్ ప్రచారంలో కూడా పాల్గొన్నారు. ఆయన విజయంలో కీలకపాత్ర పోషించారు.
భారత ఎన్నికల ప్రక్రియపై ప్రశంసలు కురిపించిన వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్
By admin1 Min Read
Previous Articleమరోసారి మెరిసిన యువ కెరటం తిలక్:ముస్తాక్ అలీ టోర్నీలో శతకం
Next Article విశ్వక్ సేన్ కొత్త చిత్రానికి టైటిల్ ఖరారు?