ఈరోజు మధ్యాహ్నం 3.30 గంటలకు సౌదీ అరేబియాలోని జెడ్డా నగరం వేదికగా ఐపీఎల్ ఆటగాళ్ల వేలం ప్రక్రియ ప్రారంభం కానుంది.ఈరోజు, రేపు 2 రోజుల పాటు ఈ వేలం జరగనుంది.అయితే
ఈసారి వేలంలో 577 మంది ఆటగాళ్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 204 స్లాట్స్ కోసం వీరు వేలంలో పోటీ పడనున్నారు. వీరిలో 367 మంది భారత ఆటగాళ్లు కాగా, 210 మంది విదేశీ క్రికెటర్లు.
కాగా ఈసారి ఈ వేలం పాటలో ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లాకు చెందిన ఓ క్రీడాకారుడు కూడా నమోదయ్యాడు.జిల్లాలోని రామచంద్రపురం మండలం అనుపల్లి పంచాయతీ నూతిగుంటపల్లికి చెందిన యద్దెల చంద్రశేఖర్ రెడ్డి, హేమలత దంపతుల కుమారుడు యద్దెల గిరీశ్ కుమార్ రెడ్డి (25) ఐపీఎల్ వేలానికి వెళ్తున్నాడు.తద్వారా వేలానికి వెళ్తున్న ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రికెటర్‌గా నిలిచాడు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రీమియర్ లీగ్‌లో మంచి ప్రదర్శన కనబరిచి 10 మ్యాచుల్లోనే 18 వికెట్లు తీశాడు.వన్డేలు,టీ-20ల్లో ఆడుతూ…మంచి గుర్తింపు అందుకున్నాడు.దీనితో ఇప్పుడు ఐపీఎల్ మెగా వేలానికి షార్ట్‌లిస్ట్ ఎంపిక అయ్యాడు.