అత్యంత వినోదాత్మక క్రికెట్ టోర్నీ ఐపీఎల్ కు వేలం ప్రారంభమైంది. కాగా, భారత యువ ఆటగాడు వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికాడు. పంత్ ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.27 కోట్లకు దక్కించుకుంది. రూ.26, 75 కోట్లకు పంజాబ్ కింగ్స్ శ్రేయాస్ అయ్యర్ ను కైవసం చేసుకుంది.కనీస ధర రూ.2 కోట్లు ఉన్న భారత పేసర్ అర్షదీప్ సింగ్ ను రూ.18 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకుంది.
ఐపీఎల్ మెగా వేలంలో ఇప్పటివరకు అమ్ముడైన ఇతర స్టార్ ఆటగాళ్ల వివరాలు
పంజాబ్ కింగ్స్:యజువేంద్ర చహల్-రూ.18 కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్:మిచెల్ స్టార్క్- రూ.11.75 కోట్లు
గుజరాత్ టైటాన్స్:జోస్ బట్లర్- రూ.15.75 కోట్లు
ఢిల్లీ క్యాపిటల్స్:కేఎల్ రాహుల్- రూ.14 కోట్లు
గుజరాత్ టైటాన్స్:మహ్మద్ సిరాజ్- రూ.12.25 కోట్లు, కగిసో రబాడా- రూ.10.75 కోట్లు
లక్నో సూపర్ జెయింట్స్:డేవిడ్ మిల్లర్- రూ.7.50 కోట్లు
ఆర్సీబీ:లియామ్ లివింగ్ స్టన్- రూ.8.75 కోట్లు
సన్ రైజర్స్ హైదరాబాద్: మహ్మద్ షమీ రూ.10 కోట్లు.
Previous Articleమీ వల్ల భ్రష్టు పట్టిన విద్యారంగాన్ని గాడిన పెట్టడం మా బాధ్యత: జగన్ కు మంత్రి నారా లోకేష్ కౌంటర్
Next Article ఈరోజు ప్రత్యేకం: ప్రధాని మోదీ