సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఐపీఎల్ ఆటగాళ్ల వేలం అత్యంత ఆసక్తికరంగా కొనసాగుతోంది. వేలం ప్రారంభమైన కొన్ని గంటల్లోనే అత్యధిక ధర రికార్డులు రెండు సార్లు బద్దలయ్యాయి.అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ఈ వేలంలో నికార్సయిన పేస్ బౌలర్ ను సొంతం చేసుకుంది.టీం ఇండియా స్టార్ బౌలర్ మహ్మద్ షమీని రూ.10 కోట్లకు కొనుగోలు చేసింది.షమీ గత సీజన్ లో గుజరాత్ టైటాన్స్ కు ప్రాతినిధ్యం వహించాడు.
సన్ రైజర్స్ హైదరాబాద్ కు ఇషాన్ కిషన్.. రూ.11.25 కోట్లు
వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ను రూ.11.25 కోట్లకు SRH దక్కించుకుంది. రూ.2కోట్ల బేస్ ప్రైజ్తో కిషన్ వేలంలోకి రాగా ఢిల్లీ, పంజాబ్, కేకేఆర్, హైదరాబాద్ పోటీపడ్డాయి. ఇతను ఐపీఎల్ కెరీర్లో 105 మ్యాచులు ఆడి 2644 రన్స్ చేశారు. స్ట్రైక్ రేట్ 135.87గా ఉంది.ఇక శ్రేయాస్ అయ్యర్ ను రూ.26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేయగా… కాసేపటికే రిషబ్ పంత్ ను రూ.27 కోట్లతో లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది.