ఛాంపియన్స్ ట్రోఫీకి సంబంధించిన షెడ్యూల్ ను ఖరారు చేసేందుకు ఐసీసీ (ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్) సమావేశం కానుంది. ఈనెల 29న వర్చువల్ గా నిర్వహించే భేటీలో షెడ్యూల్ పై తుది నిర్ణయం తీసుకోనుంది. 2025 ఫిబ్రవరి- మార్చిలో పాకిస్థాన్ లో ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది. అయితే పాకిస్థాన్ లో పర్యటించేందుకు భారత్ విముఖత వ్యక్తం చేయడంతో షెడ్యూల్ ప్రకటన ఆలస్యమవుతోంది. ఈనేపథ్యంలో షెడ్యూల్ ని ఖరారు చేసేందుకు ఐసీసీ సిద్ధమవుతోంది.
2008లో ముంబయిపై ఉగ్రవాదుల దాడి తర్వాత పాక్ లో భారత్ పర్యటించలేదు. అక్కడకి వెళ్లడం కుదరదని స్పష్టం చేసిన భారత్ తటస్థ వేదికపై యూఏఈలో తమ మ్యాచ్లు ఆడతామని తెలిపింది. అయితే ఈ ప్రతిపాదనకు పాక్ అంగీకరించలేదు. దీంతో షెడ్యూల్ పై నిర్ణయం తీసుకునేందుకు ఐసీసీ స్వయంగా రంగంలోకి దిగింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు