రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో నిన్న రాత్రి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.రాజ్‌సమంద్ బీజేపీ ఎమ్మెల్యే, విశ్వరాజ్ సింగ్ మేవార్‌ను ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లోకి రాకుండా ఆయన బంధువులు అడ్డుకున్నారు.దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకొని పలువురు గాయపడ్డారు.ఈ పరిణామంతో మేవార్ రాజ కుటుంబంలో ఉన్న విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి.రాజ్‌పుత్ రాజు మహారాణా ప్రతాప్ వారసులైన మహేంద్ర సింగ్ మేవాడ్, అరవింద్ సింగ్ మేవాడ్‌ల మధ్య కొన్నేళ్లుగా విభేదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో వాడ్ రాజ్య 77వ మహారాజుగా విశ్వరాజ్ సింగ్ సోమవారం పట్టాభిషేకం చేశారు.పట్టాభిషేకం అనంతరం ఏకలింగనాథ్ ఆలయం,ఉదయ్‌పుర్‌లోని సిటీ ప్యాలెస్ ఆయన సందర్శించాల్సి ఉండగా…ట్రస్ట్ ఛైర్మన్‌గా ఉన్న అరవింద్ సింగ్ దానికి అంగీకరించలేదు. కోటలోకి నూతన మహారాజు అనుమతించమని పేర్కొంటూ ఆదేశాలు జారీ చేశారు.కోట తలుపులు మూసి ఉండటంతో దాదాపు ఐదు గంటలు విశ్వసింగ్ అక్కడే నిల్చుని ఉన్నారు.ఈ క్రమంలోనే దాదాపు ఇరు వర్గాల మధ్య రాళ్లదాడి జరిగింది.